గతేడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పై నమోదైన కేసులో... శ్రీనివాసులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను అనంతపురం కోర్టు తిరస్కరించింది. ముగ్గురు పిల్లలు ఉన్నారని తెదేపా అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించటంతో వారికి మద్దతుగా కాలవ శ్రీనివాసులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కాలవపై ఎంపీడీవో చేసిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి.