ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు.. తాడిపత్రిలో ఐదు రెడ్​జోన్లు - thadipatrhi corona updates

కరోనా వ్యాప్తి దృష్ట్యా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఐదు ప్రాంతాలను అధికారులు రెడ్​జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 12 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.... కరోనాతో ఒకరు మృతి చెందారు.

తాడిపత్రిలో ఐదు రెడ్​జోన్లను ప్రకటించిన అధికారులు

author img

By

Published : Jun 20, 2020, 3:56 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఐదు ప్రాంతాలను అధికారులు రెడ్​జోన్లుగా ప్రకటించారు. పట్టణంలోని నందలపాడు, సీపీఐ కాలనీ, సంజీవ్ నగర్, కృష్ణాపురం ఒకటో రోడ్డు, కాల్వగడ్డ, గన్నేవారిపల్లి కాలనీల్లో ఇప్పటివరకు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడి ఒకరు మృతి చెందారు. అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వైరస్ నివారణ కొరకు బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: గుడ్​న్యూస్​: కరోనాకు భారత్​లో డ్రగ్ రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.