అనంతపురం టవర్ క్లాక్ సమీపంలోని మున్సిపల్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కంప్యూటర్ల మరమ్మతుల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బంద్ కారణంగా దుకాణాలన్నీ మూసివేసినా.. కూరగాయల మార్కెట్ మాత్రం తెరిచే ఉంచారు. ఈ క్రమంలో ఓ దుకాణం నుంచి పొగ వస్తుండటంతో వ్యాపారులు గుర్తించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు మంటలను అదుపు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది.
ఈ ప్రమాదంలో రిపేరుకు వచ్చిన కంప్యూటర్లు, ప్రింటర్లతోపాటు అమ్మకానికి తెచ్చిన అనుబంధ వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపకశాఖ సిబ్బంది ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. అలాగే దుకాణంలో వస్తువులకు జరిగిన ఆర్థిక నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండీ.. ఏపీ ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్