ETV Bharat / state

కరోనా యోధులకు "వందనం" పేరిట ఘన సన్మానం - జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

కరోనా యోధులకు వందనం పేరుతో అనంతపురం జిల్లాలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు కరోనా రోగులకు సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులు, కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు.

కరోనా యోధులకు "వందనం" పేరిట ఘన సన్మానం
కరోనా యోధులకు "వందనం" పేరిట ఘన సన్మానం
author img

By

Published : Nov 13, 2020, 6:28 PM IST

అనంతపురం జిల్లాలో కరోనా యోధులకు "వందనం" పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఆర్డీటీ ఆస్పత్రి, సత్యసాయి వంటి సేవా సంస్థలు ఉన్నందునే కరోనాను జయించటంలో ముందున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. కరోనా సమయంలో కూడా పేదల ఉపాధి కోల్పోకుండా మాస్కులు, పీపీఈ కిట్లు కుట్టించి, పంపిణీ చేసినట్లు తెలిపారు.

మహిళా సంఘాల ద్వారా..

మహిళా సంఘాల ద్వారా మాస్కులు కుట్టించి, మురికివాడల్లో, పేదలు నివశించే కాలనీల్లో ఉచితంగా అందజేశామన్నారు. కరోనా రోగులకు సేవలందించడానికి ఆర్డీటీ ఆస్పత్రిని బత్తలపల్లికి అప్పగించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు అన్నెఫెర్రర్ పేర్కొన్నారు.

విశేష సేవలందించారు..

తమ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు విశేష సేవలందించారని ఆమె కొనియాడారు. అనంతపురం జిల్లా ప్రజలు చాలా మంచివారని, వాళ్లందరి సహాయ, సహకారాలతో తాము పేదలకు సేవలందిస్తున్నామన్నారు. తాను కూడా కరోనా వైరస్​ను జయించానని అన్నెఫెర్రర్ స్పష్టం చేశారు.

కలెక్టర్ ఆర్థిక సాయం..

తలిదండ్రులను కల్పోయి ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి కలెక్టర్ 50వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందచేశారు.

కరోనా యోధులకు
కరోనా యోధులకు "వందనం" పేరిట ఘన సన్మానం

ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.