అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతిచెదారు. పెన్నహోబిలం సమీపంలోని పొలంలో కరెంట్ షాక్ కొట్టి మరణించారు. గ్రామానికి చెందిన ఆదినారాయణ అనే రైతు, తన కుమారుడు వెంకటేశ్‌తో కలిసి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లారు. పైపులు బిగిస్తున్న సమయంలో హఠాత్తుగా కరెంట్ వచ్చింది. ఆదినారాయణకు షాక్ కొట్టింది. అతను బిగ్గరగా అరవటంతో తండ్రిని కాపాడేందుకు వెంకటేశ్ ప్రయత్నించగా అతనికీ షాక్ తగిలింది. ఈ ఘటనలో.. వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
జరిగిన సంఘటనను తోటి రైతులు గమనించి విద్యుత్ సరఫరా నిలిపివేసి వారిని బయటకు తీసుకువచ్చారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంకటేశ్‌కు నాలుగేళ్ల క్రితం వివాహం కాగా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: