ETV Bharat / state

భూనిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తం.. రైతుల అరెస్ట్ - farmers protest in parigi ananthapur

అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలోని భూ నిర్వాసిత రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసిన క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. తమ భూముల్లో వేరే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా లే- అవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నించడంపై భూ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూనిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తం.. రైతుల అరెస్ట్

author img

By

Published : Oct 25, 2020, 1:08 AM IST

అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలో భూ నిర్వాసిత రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూములు తీసుకుని షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. అనంతరం సదరు ఫ్యాక్టరీ తరలి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ భూముల్లో వేరే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా లే- అవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నించడాన్ని భూ నిర్వాసితులు ఖండించారు.

వెనక్కివ్వాలి..

అనంతరం సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రైతులకు భూమి తిరిగి ఇవ్వాలని లేకపోతే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులకు అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

బలవంతపు అరెస్ట్​లు..

భూ నిర్వాసిత రైతులను సీపీఐ నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇవీ చూడండి : 'అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.