అనంతపురం జిల్లా చాపిరి గ్రామంలో ఎలుగుబంటి దాడి చేయటంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. చాపిరి గ్రామంలో తన వేరుశనగ పంట పొలం వద్ద రోజు మాదిరిగానే కాపలాకు వెళ్లాడు. తెల్లవారుజామున పొదల్లో నుంచి వచ్చిన ఎలుగుబంటి తనపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఇరుగుపొరుగు రైతులు వచ్చి కేకలు వేయడంతో వదిలి వేసిందన్నారు. గాయాలైన తనను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు బాధితుడు వివరించాడు. రైతులతో అటవీశాఖ సిబ్బంది పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. మావోయిస్టుల ఫోటోలతో పోస్టర్లు..ఆచూకీ తెలిపితే పారితోషికం