అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం ఓరువాయి సమీపంలో పార్లబండ గుట్టలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. పాండవుల గుహగా పిలిచే ఈ గుట్టకు సమీపంలో కొన్నేళ్ల కిందటి వరకు ఒక గ్రామం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతం ప్రత్యేకతను గుర్తించిన గుప్తనిధుల వేటగాళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి పూజలు చేసి ప్రత్యేక చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తవ్వకాలు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి అనుమానం ఉన్న వ్యక్తుల గురించి అడిగి వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి: నడుచుకుంటూ వెళ్తే ఆపరు అనుకున్నాడేమో..! గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్