ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అనంతపురంలో 2కే వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంగయ్య, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలని ఎంపీ కోరారు. ఆధునిక కాలంలో మనిషి జీవన విధానంలో మార్పులు వచ్చాయని, వీటిని అధిగమించేందుకు నడక వ్యాయామం అలవాటుగా చేసుకోవాలని రంగయ్య పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ నడక తప్పనిసరి చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: ఫిట్ ఇండియా సందర్భంగా విద్యార్థులు ప్లకార్డుల ప్రదర్శన