Workers Went on Strike and Stopped the Water Supply: ఆ కార్మికులంతా దశాబ్దాలుగా పనిచేస్తున్న చిరు ఉద్యోగులు. వారంతా వేతనాలు పెంచమని అడగటంలేదు.. తమకు రావల్సిన వేతన బకాయిలు చెల్లించండి మహా ప్రభో.. కుటుంబాలను పోషించుకోలేక పోతున్నామని మొరపెట్టుకుంటున్నారు. అయినా ప్రభుత్వం నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించలేదు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి పీఎఫ్ జమ చేయలేదు.
Drinking Water Problem: నీటి కోసం ఎదురుచూపులు.. పట్టించుకునే వారే కరువయ్యారు..
Employees PF Accounts have not been Credited: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహాన్ని సత్యసాయి, శ్రీరామిరెడ్డి పథకాలు తీరుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా సుమారు 16 వందల గ్రామాలకు తాగునీరు అందుతోంది. శ్రీ సత్యసాయి తాగునీటి పథకంలో 5 వందల 72 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలల నుంచి జీతాలు అందడం లేదు. కార్మికుల వేతనాలు నుంచి మినహాయించిన పీఎఫ్ సొమ్మును 18 నెలల నుంచి వారి ఖాతాల్లో జమ చేయడం లేదు. కలెక్టర్‌కి ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదంటూ కార్మికులు వాపోతున్నారు. విన్నపాలతో విసిగిపోయిన కార్మికులు.. నేటి నుంచి సమ్మెబాట పడుతామని తెలిపారు.
Workers Dharna in front of Collectorate: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో దాదాపు 6 వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో.. గత నెలలో కలెక్టర్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు. పట్టించుకోకపోవడంతో కడుపు మండిన కార్మికులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నారు. అయినా స్పందన లేకపోవడంతో.. ఈ నెల 19 అర్ధరాత్రి నుంచి తాగునీటి పంపులు నిలిపివేసి.. సమ్మెబాట పట్టారు. వేతనాలు ఇచ్చే వరకు సమ్మె విరమించేదే లేదంటూ తేల్చి చెబుతున్నారు.
Drinking water Problem in Ananthapur ఇంకా తాగునీటి కష్టాలా..! పాలకులు.. కాస్త దృష్టి పెట్టండి..!
Gvernment is Neglecting Workers: కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. శ్రీరామిరెడ్డి పథకం తాగునీటి సరఫరాను కార్మికులు నిలిపివేయడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కల్యాణదుర్గం మండలం పాలవాయిలో నీళ్లు రాకపోవడంతో. గ్రామస్థులు రాత్రి 10 గంటల సమయంలో వ్యవసాయ మోటార్ల దగ్గర నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ.. బిందెలతో నీటి కోసం పరుగులు తీస్తున్నారు.అవస్థలు పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమ్మె వల్ల తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించి తమ గొంతు ఎండకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Water Supply to 800 Villages will be Stopped: సమ్మె చేస్తున్న కార్మికులకు వేతనాలు ఎపుడు విడుదల చేస్తారో ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. కార్మిక సంఘం నేతలు అమరావతికి వెళ్లి రెండు రోజులుగా అక్కడే ఉండి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కార్మికుల వేతనాలు తక్షణమే విడుదల చేయకపోతే ప్రస్తుతం తాగునీరు అందని గ్రామాలకు తోడు, మరో 800 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది.