అనంతపురం పాతూరులోని బ్రాహ్మణ వీధిలో గోవింద వాసవి మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించి పర్యావరణాన్ని రక్షించాలని భజన మండలి సభ్యులు కోరారు.
కరోనా సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. భజన మండలి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కరోనా మహమ్మారి అంతమైపోవాలని వినాయకుని ప్రతి ఒక్కరూ పూజించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: