ETV Bharat / state

శిథిలావస్థలో పాఠశాల భవనాలు.. పెచ్చులూడుతున్న గదుల పైకప్పు - అనంతపురంలో శిథిలావస్థలో పాఠశాల భవనాలు

బడి భయపెడుతోంది.. విద్యార్థులను ప్రమాదాల్లోకి నెడుతోంది.. ఆదివారం ప్రకాశం జిల్లాలో శిథిలావస్థలో ఉన్న భవనం కూలి ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. అలాంటి శిథిలమైన భవనాలు అనంతపురం జిల్లాలోనూ ఉన్నాయి. పూర్తిగా శిథిలమైన భవనాలు కూల్చేయాలని గతంలో కలెక్టరు ఆదేశించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైకప్పు పెచ్చులూడి పడుతున్నా కనీసం మరమ్మతు చేయించలేని దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయాందోళనలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికైనా శిథిల గదులను తొలగించాలని, ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Dilapidated  schools
శిథిలావస్థలో పాఠశాల భవనాలు
author img

By

Published : Aug 31, 2021, 11:42 AM IST

‘2016లో గోరంట్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బండపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అప్పటి కలెక్టరు కోన శశిధర్‌ జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను గుర్తించాలని ఆదేశించారు. పూర్తిగా శిథిలమైన గదులను తక్షణమే తొలగించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. అయితే చాలా ప్రాంతాల్లో తొలగించలేదు.’

‘2018లో అనంతపురంలోని వెంకోబరావు నగరపాలక పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. విద్యార్థులంతా ఆరుబయట ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలోని భవనం పెచ్చులు ఊడిపడి అప్పట్లో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.’

రాష్ట్రంలో పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలు శిథిలవస్థకు చేరుకున్నాయి. కనీస మరమ్మతు లేకపోవటంతో.. చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.

‘నాడు-నేడు’ కొన్నింటికే

మనబడి నాడు-నేడు పనులు 2019లో ప్రారంభించారు. జిల్లాలో 1,294 పాఠశాలల్లోనే మరమ్మతులు చేశారు. వీటిల్లోనూ కొన్నిచోట్లే కొత్త భవనాలు నిర్మించారు. చాలాచోట్ల పాత భవనాలకు మరమ్మతులు చేసి, రంగులేశారు. శిథిల భవనాలను తొలగించడానికి ప్రధానంగా నిధుల సమస్య అడ్డంకిగా మారింది. గతంలో ఎంపీడీఓల ద్వారా తొలగించాలని నిర్ణయించారు. ఒక గది తొలగించాలంటే కనీసం రూ.50 వేలు ఖర్చు చేయాల్సిందే. నిధులు మంజూరు చేయకుండా ఎలా తొలగించాలో పాలుపోక అలాగే వదిలేశారు.

వానాకాలం జాగ్రత్త

సాధారణంగా వర్షా కాలంలో ముప్పు ఎక్కువ. పాత భవనాల్లోకి వర్షపునీరు చేరుతోంది. గోడలు తడుస్తాయి. నీరంతా ఇంకడంతో పైకప్పు పెచ్చులు ఊడిపడతాయి. గతంలోనూ ఎక్కువగా వర్షాకాలంలోనే ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం జరగక ముందే యంత్రాంగం మేల్కోవాల్సిన అవసరం ఉంది.

శిథిల గదుల్లో కూర్చోపెట్టొద్దు

ఎట్టి పరిస్థితుల్లో శిథిల గదుల్లో విద్యార్థులను కూర్చోపెట్టొద్ధు మరీ ప్రమాదకరంగా భవనాలు ఉంటే, ప్రతిపాదనలు పంపితే ప్రత్యామ్నాయం చూపుతాం. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నిధులు తెప్పించేందుకు రాష్ట్ర కార్యాలయానికి నివేదిస్తాం. ఎక్కడా ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.

_ తిలక్‌ విద్యాసాగర్‌, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్త

ఇది మడకశిరలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం. ఈ ప్రాంగణంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నిర్వహిస్తున్నారు. భవనం పై కప్పు శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉంది. రెండేళ్ల కిందట రెండో అంతస్తులో తరగతులు నిర్వహించాలని ఇనుప రేకులు వేసినా గాలి, వానకు ఎగిరిపోయాయి. అప్పట్నుంచి మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. ఎండకు ఎండి, వర్షాలకు తడిచి మొండిగోడలు క్రమంగా కూలిపోతున్నాయి. గోడలను తొలగించకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. - మడకశిర

రాయదుర్గం పట్టణం డీ.హీరేహాళ్‌లోని ప్రధాన ప్రాథమిక పాఠశాలలోని భవనం ఇది. బ్రిటీష్‌ హయాంలో 1911లో నిర్మించారు. కన్నడ మాధ్యమంలో 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరు గదులు ఉండగా.. మూడు వర్షం కురిస్తే కారుతున్నాయి. ఓ గది పైకప్పు పెంకులు పగిలి పోవడంతో దానికి తాళం వేశారు. మరో గది పైకప్పు కూలడంతో నిరుపయోగంగా ఉంది. ముప్పు పొంచిఉన్నా.. కనీసం మరమ్మతు చేయడం లేదు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు శశిధర్‌ను వివరణ కోరగా నాడు నేడు కింద పాఠశాల ఎంపికైందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

పైకప్పు పెచ్చులూడి కడ్డీలు కనిపిస్తూ...

తలుపుల మండలం జ్యోతివాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులూడి కడ్డీలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడున్న రెండు గదులు వర్షానికి కారుతున్నాయి.

ధర్మవరం పట్టణంలోని చిన్నూరు పురపాలక ప్రాథమిక పాఠశాలలో 60 మంది చదువుతున్నారు. ఇక్కడి ప్రాంగణంలో శిథిలమైన భవనం ఉంది. విరామ సమయంలో విద్యార్థులు ఆ భవనంలోకి వెళ్లి ఆడుకుంటున్నారు. భవనాన్ని తొలగిస్తే.. ఆట స్థలంగా మార్చుకోవచ్ఛు విద్యార్థులకు ముప్పు తప్పుతుంది.

  • ప్రభుత్వ పాఠశాలలు : 3,841
  • విద్యార్థులు : 3,58,072
  • శిథిలమైన భవనాలు : 450
  • మరమ్మతు చేయాల్సిన గదులు : 500
  • తొలగించాల్సినవి : 358

ఇదీ చదవండీ.. మంత్రి ఇంటి ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.