ప్రపంచవ్యాప్తంగా చేతివృత్తుల వారు తయారుచేసిన వస్తువులకు మంచి డిమాండ్ ఉందని, వాటికి తగిన మార్కెట్ సౌకర్యం కల్పించాల్సి ఉందని రాయలసీమ రేంజ్ డీఐజీ కాంతీలాల్ ఠాణా అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల కేంద్రంలో గురువారం అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో కలసి ఆయన పర్యటించారు. కంబళ్లు నేసే కురుబ సొసైటీకి సంబంధించిన నేతలతో మాట్లాడారు. ఇక్కడ తయారైన కంబళ్లు తక్కువ ధరకు కర్ణాటకలో అమ్ముకుంటున్నారని ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్ ద్వారా అమ్మితే ఒక్కొక్క కంభళి మూడువేల దాకా ధర పలుకుతుందని వివరించారు. డీఐజీ, ఎంపీ, ఇతర అధికారులు కలసి కంభళి తయారీ పరిస్థితి అధ్యయనం చేసేందుకే పర్యటన చేస్తున్నామన్నారు. ఇప్పటికే నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 24 వేలు ప్రభుత్వం సాయం చేస్తోందని వివరించారు.
ఇదీ చదవండి: