ETV Bharat / state

3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో... ఆక్సిజన్ పడకల తగ్గింపు? - Anantapur District Latest News

పడకల కోసం బాధితులు పోరాటాలు చేస్తుంటే... అనంతపురంలో ఆక్సిజన్‌ నిల్వలకు సరిపడా బెడ్లు మాత్రమే ఉంచుతూ మిగతావి తొలగిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ట్యాంకుల సామర్థ్యం పెంచాలే తప్ప పడకల సంఖ్య తగ్గించడమేంటని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకల తగ్గింపు

author img

By

Published : May 13, 2021, 5:49 PM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకల తగ్గింపు

అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ పడకల సంఖ్యను తగ్గిస్తున్నారు. సర్వజనాసుపత్రి, సూపర్‌ స్పెషాలిటీ, క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో 170 నుంచి 200 దాకా బెడ్లు తగ్గించాలని నిర్ణయించారు. తదనుగుణంగా సర్వజనాసుపత్రిలో మంగళవారం, బుధవారం 40 చొప్పున పడకలు... ఆక్సిజన్‌ నుంచి సాధారణ పడకలుగా మారాయి.

ఆసుపత్రుల్లో ప్రాణవాయువు ట్యాంకుల సామర్థ్యం తక్కువగా ఉందని బెడ్ల సంఖ్య తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ అందక ఇటీవల సర్వజనాసుపత్రిలో 8 మంది, క్యాన్సర్ ఆసుపత్రిలో ఐదుగురు కన్నుమూశారు. వరుస దుర్ఘటనల నేపథ్యంలో మంగళవారం సమావేశమైన అధికారులు... ఆక్సిజన్ పడకల సంఖ్య తగ్గింపే పరిష్కారమని తేల్చారు.

అనంతపురం సర్వజనాసుపత్రిలో 615 పడకలుండగా... అందులో 311 ఆక్సిజన్‌, 54 వెంటిలేటర్, 250 సాధారణమైనవి. వెంటిలేటర్‌ పడకలను అలాగే ఉంచి ఆక్సిజన్‌ బెడ్ల సంఖ్య తగ్గిస్తున్నారు. నగరంలోని 3 ఆసుపత్రుల్లో 32.5 కే.ఎల్. సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి.

ప్రస్తుతం ప్రాణవాయువు కొరత ఏర్పడటంతో కర్ణాటకలోని బళ్లారి నుంచి రోజూ ట్యాంకర్లు వస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవటం వల్ల.... పడకల సంఖ్య కుదించి తద్వారా ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించి క్రమబద్ధీకరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు సైతం దీనిపై మార్గనిర్దేశమివ్వటంతో పడకల తగ్గింపు అనివార్యమైంది.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.