అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం నీలూరులో జరిగింది. అంజన్ కుమార్ అనే యువ రైతు, అధిక వర్షాలు వల్ల సాగు చేసిన పంట చేతికందక పోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.
చేసిన అప్పులు తీర్చలేక పోతున్నానన్న మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని శవ పరీక్షల కోసం పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.