ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కలెక్టర్‌పై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలు సంఘాలు ధర్నాలు చేశాయి. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ.. అనంతపురంలో దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. న్యాయ నిబద్ధతతో పనిచేస్తున్న కలెక్టర్‌పై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉరవకొండలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డిని అరెస్ట్ చేయాలని అంబేడ్కర్ ఆశయ పోరాట సమితి అధ్యక్షుడు బాదూరు యల్లయ్య, యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని టవర్ క్లాక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం టవర్ క్లాక్ నుంచి ర్యాలీగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.
జగన్ గారూ.. నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి..?