రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన వైకాపా ప్రభుత్వం.. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో వాయిదా వేస్తున్నారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఉరవకొండలోని పేద ప్రజలకు.. పట్టాలు పంపిణీ చేయకుండా ఆలస్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నిరసన చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్కు తరలించారు. రాజకీయ స్వార్థం కోసం.. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా తమను బలి చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
ఇదీ చదవండి:
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనల వెల్లువ