దేశంలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మొండిచేయి చూపిందని సీపీఎం పార్టీ నాయకులు మండిపడ్డారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సీపీఎం నాయకులు దహనం చేశారు. మొదట టవర్ క్లాక్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో పోలీసులు, సీపీఎం నాయకుల మధ్య తోపులాట జరిగింది. సీపీఎం నాయకులు గట్టిగా నినాదాలు చేస్తూ.. తల లేని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇదీ చూడండి భోజనాలు పెట్టారు సరే... తినేందుకు స్థలమేది?