ETV Bharat / state

'మర్రిమాకులపల్లి నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి'

చిత్రావతి జలాశయం ముంపు గ్రామమైన మర్రిమాకులపల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా గ్రామం ఖాఖీ చేయించటం అన్యాయమని వామపక్ష పార్టీల నేతలు అన్నారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

CPM, CPI protest that no compensation has been given to Marrimakulapalli residents
మర్రిమాకులపల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలేదని...సీపీఎం, సీపీఐ నిరసన
author img

By

Published : Nov 3, 2020, 8:24 PM IST

ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట వామపక్షాల నేతలు ధర్నా చేపట్టారు. చిత్రావతి జలాశయం ముంపు గ్రామమైన మర్రిమాకులపల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా అన్యాయంగా గ్రామం ఖాళీ చేయించారని ఆరోపించారు. ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

రైతుల తరపున నిలిచిన సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు బెదిరించటం, అక్రమంగా పోలీస్ స్టేషన్​లో నిర్భంధించటం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడతామని వామపక్ష నాయకులు అన్నారు. ధర్నాలో సీపీఎం జిల్లా దక్షిణ ప్రాంత కార్యదర్శి ఇంతియాజ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి.. సీపీఐ, సీపీఎం పట్టణ కార్యదర్శులు మధు, పెద్దన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ఏమైనా విజ్ఞప్తులు ఉంటే సింగిల్ జడ్జి వద్దకే వెళ్లాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.