కార్పొరేట్ వైద్య సంస్థలకు ఊడిగం చేసేందుకే కేంద్రం, జాతీయ వైద్య కమిషన్ బిల్లును ప్రవేశ పెట్టిందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లాలో ఎన్ఎంసి బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తోన్న ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎన్ ఎం సి బిల్లు పై విద్యార్దులు చేస్తోన్న పోరుకు తాము అండగా నిలబడతామని రామకృష్ణ ప్రకటించారు. బిల్లు ను వెంటనే ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:పడవలు బోల్తా... మత్స్యకారుల రక్షణకు చర్యలు