Vivekananda Reddy murder case: వైస్ వివేకనందరెడ్డి హత్య కేసులో.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే సీబీఐ విచారణలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఊపిరి పిల్చనివ్వకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయగా.. తాజాగా సీపీఐ నేత రామకృష్ణ ఆరోపణలు చేశారు. ఎవరు చంపారన్న విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసని ఆరోపించారు. ఈ కేసులో న్యాయం కోసం వివేకనందరెడ్డి కూతురు డాక్టరు సునీత పోరాడుతున్న తీరును ప్రశంసించారు.
వైస్ వివేకనందరెడ్డి హత్య కేసును అనవరసరంగా తమ మీదకు తోస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అధికారంలో ఉండి నిజం ఏంటో ఎందుకు తేల్చడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉరవకొండ టీడీపీ కార్యాలయంలో రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రాకముందు అప్పటి సీఎం చంద్రబాబు ఆ హత్య చేయించారని వారు ప్రచారం చేశారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయ్యిందని, అప్పటి సీఎం చేసి ఉంటే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కేవలం కేసుపై ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం ఏవేవో మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆయన్ను ఎవరు చంపారన్న విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలుసని రామకృష్ణ వెల్లడించారు.
వివేకనందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించడానికి ఇతరుల మీద ఎన్ని ఆరోపణలు చేసినా, జనం నమ్మటం లేదన్నారు. నాలుగేళ్లు గడిచినా వివేకనందరెడ్డిని ఎవరు చంపారనే విషయం పోలీసులకు తెలియదని ఎద్దేవా చేశారు. పులివెందులకు వెళ్లి పిల్లలను అడిగినా ఆయన్ను ఎవరు చంపారన్న విషయాన్ని బహిరంగంగా చెబుతారని రామకృష్ణ తెలిపారు. హైకోర్టు కూడా 13వ తేదీ వరకు మాత్రమే అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చిందని, ఆ తరువాత ఎవరు ఆ హత్యకు బాధ్యులన్న విషయం అందరికీ తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో వాస్తవాలు బయటికి తెచ్చిన వివేకనందరెడ్డి కూతురు డాక్టరు సునీతను అభినందించాల్సిన అంశం అన్నారు. కొడుకులకన్న అలాంటి కూతురు ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
'వైసీపీ అధికారంలోకి రాకముందు వివేకనందరెడ్డిని అప్పటి సీఎం చంద్రబాబు ఆ హత్య చేయించారని ఆరోపించారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయ్యింది, అప్పటి సీఎం చంద్రబాబు హత్య చేసి ఉంటే కేసు ఎందుకు పెట్టలేదు. వివేకనందరెడ్డిని ఎవరు చంపారన్న విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. వివేకనందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించడానికి ఇతరుల మీద ఆరోపణలు చేసినా, జనం నమ్మటం లేదు. పులివెందులకు వెళ్లి పిల్లలను అడిగినా ఆయన్ను ఎవరు చంపారన్న విషయాన్ని బహిరంగంగా చెబుతారు. హైకోర్టు కూడా 13వ తేదీ వరకు మాత్రమే అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు మినహాయింపు ఇచ్చింది. వివేకనందరెడ్డి హత్య కేసు విషయంలో పోరాడుతున్న ఆయన కూతురు డాక్టరు సునీతను అభినందించాలి.'- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: