ETV Bharat / state

CPI Ramakrishna: జగన్ ఆ పని చేయకుంటే పోరాటమే : సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ న్యూస్

CPI Ramakrishna Fire On State And Central Govt's: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కర్మాగారాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా.. అభివృద్ధి మాత్రం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరిస్తే ఉరుకునేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీపీఐ రామకృష్ణ ధ్వజం

author img

By

Published : Dec 18, 2021, 10:50 PM IST

CPI Ramakrishna Fire On State And Central Govt's: ప్రభుత్వ రంగ బ్యాంకులు, కర్మాగారాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. మోదీ వ్యతిరేక నిర్ణయాలు వల్ల సామాన్య ప్రజల బ్రతుకులు ప్రశ్నార్థకం అవుతున్నాయన్నారు. కేవలం మోదీ సహచరుల వల్లే బ్యాంకులు ఆర్థికంగా దెబ్బతిన్నాయని.. రైతుల వల్ల కాదని అన్నారు. బ్యాంకుల ప్రైవేటీకణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా..అభివృద్ధి మాత్రం శూన్యమని రామకృష్ణ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతిచ్చి.. ఇప్పుడు మాట తప్పి మూడు రాజధానులంటూ ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై పునరాలోచించి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్.. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. విభజన హామీల్లో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని ప్రశ్నించిన రామకృష్ణ.. సొంత జిల్లాకే పరిశ్రమలు తెచ్చుకోలేని స్థితిలో జగన్ ఉన్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరిస్తే ఉరుకునేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

ఇదీ చదవండి

Ayyanna On YSRCP Govt: కక్ష సాధించడానికి.. సీఐడీని వాడుకోవడం దారుణం: అయ్యన్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.