అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కొవిడ్ - 19 మొబైల్ టెస్టింగ్ యూనిట్‌ను ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రారంభించారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మొబైల్ టెస్టింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనంలో వైద్య సిబ్బందితో పాటు టెస్టింగ్ పరికరాలు అందుబాటులో ఉంటాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహిస్తారు.
ఇది చూడండి..