ETV Bharat / state

తిరుపతికి అని చెప్పి...తిరిగి రాని లోకాలకు.. - కదిరిలో దంపతుల ఆత్మహత్య

అనంతపురం జిల్లా కదిరిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ వస్త్ర దుకాణంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

couple commits suicide at kadiri
దంపతుల ఆత్మహత్య
author img

By

Published : Oct 25, 2020, 4:51 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో విషాదం చోటుచేసుకుంది. తిరుమలకి వెళ్తుతున్నామని చెప్పి దంపతులు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. తమ వస్త్ర దుకాణంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సజ్జ ప్రసాద్, లత దంపతులు కదిరిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. వీరికి బి. టెక్ చదువుతున్న కుమార్తె, ఇంటర్ పూర్తి చేసిన కుమారుడు ఉన్నారు. పిల్లలిద్దరిని సమీప బంధువుల ఇంట్లో వదిలి.. తిరుపతికి వెళ్తున్నామని ఈ నెల 22న చెప్పారు.

ఈ నెల 23న బంధువులు వారికి ఫోన్ చేస్తున్నా సమాధావం ఇవ్వడం లేదు. అనుమానం వచ్చిన లత తండ్రి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లతా, ప్రసాద్ సెల్ ఫోన్లు కదిరిలోనే ఉన్నట్లు గుర్తించారు. దంపతులు నిర్వహిస్తున్న వస్త్ర దుకాణంలో దుర్వాసన వస్తున్నట్లు ఇరుగు పొరుగు వారు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దుకాణం తలుపులు పగలగొట్టారు. భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దంపతులు సుమారు మూడు రోజుల కిందటే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. దర్యాప్తులో ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని అన్నారు.

ఇదీ చదవండి: 'పోలవరం' పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.