అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఒకరికి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నియోజకవర్గం గ్రీన్ జోన్‌గా ఉంది. కొత్తగా తనకల్లు మండలంలో ఓ వ్యక్తికి ఆ వైరస్ లక్షణాలు ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మండల వ్యాప్తంగా ప్రజలకు భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వివిధ శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఐఎంఏ ప్రతినిధులు... తనకల్లు ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సామగ్రిని అందజేశారు.
తనకల్లులో ఒకరికి కరోనా లక్షణాలు... అప్రమత్తమైన యంత్రాంగం - coronavirus latest news
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లులో... ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు తగిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఒకరికి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నియోజకవర్గం గ్రీన్ జోన్‌గా ఉంది. కొత్తగా తనకల్లు మండలంలో ఓ వ్యక్తికి ఆ వైరస్ లక్షణాలు ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మండల వ్యాప్తంగా ప్రజలకు భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వివిధ శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఐఎంఏ ప్రతినిధులు... తనకల్లు ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సామగ్రిని అందజేశారు.
ఇదీ చదవండి: గుత్తి నుంచి మధ్యప్రదేశ్ వలస కూలీల తరలింపు