విత్తన పంపిణీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. అనంతపురం జిల్లా గుత్తిలో రాయితీ విత్తనాల కోసం మూడు రోజుల పాటు రైతులు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీకి అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు మండల పరిధిలోని పలు గ్రామాలకు విత్తన పంపిణీ చేద్దామనుకున్న అధికారులకు, విత్తన పంపిణీ ప్రారంభోత్సవానికి వచ్చిన శాసనసభ్యులు వెంకట్రామిరెడ్డి రైతులతో వాగ్వాదానికి దిగారు.
వర్షాలు కురుస్తున్నా అధికారులు మాత్రం విత్తన పంపిణీలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిల్చున్నా విత్తనాలు అందడం లేదన్నారు. అధికారులు ఏ సమయంలో విత్తనాలు ఇస్తారో రైతులకు తెలపలేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ విషయమై కాసేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే అధికారులతో చర్చించి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలనే ఆలోచనతోనే జాప్యం జరిగిందన్నారు. అందరికీ విత్తనాలు అందుతాయన్నారు. రైతన్నలందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే హామీతో రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి : పోలవరం స్టాప్వర్క్ ఆర్డర్ మరో రెండేళ్లు పొడిగింపు