ETV Bharat / state

మన ఎమ్మెల్యే సింహం లాంటోడు: సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు - ap latest news

‘మన ఎమ్మెల్యే సింహం లాంటోడు. ఆయనలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఎవరికి ఏం అవసరమో ఆయనకు తెలుసు’ అంటూ అనంతపురం జిల్లా గుత్తి సీఐ రాము గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డిని పొగుడుతూ మాట్లాడిన వీడియో వైరల్‌ అయింది.

ci comments
ci comments
author img

By

Published : Sep 30, 2021, 7:19 AM IST

‘మన ఎమ్మెల్యే సింహం లాంటోడు. ఆయనలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఎవరికి ఏం అవసరమో ఆయనకు తెలుసు’ అంటూ అనంతపురం జిల్లా గుత్తి సీఐ రాము గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డిని పొగుడుతూ మాట్లాడిన వీడియో వైరల్‌ అయింది. మంగళవారం గుత్తిలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఎమ్మెల్యే, సీఐ హాజరయ్యారు. సీఐ మాట్లాడుతూ ‘మన ఎమ్మెల్యే సార్‌ సింహం లాంటి వారు. సింహానికే లీడర్‌షిప్‌ లక్షణాలు ఉంటాయి. ఇంకే జంతువుకూ ఉండవు. ఎక్కడ, ఎవరికి, ఏం పని చేయాలి.. ఏం సాయం చేయాలి.. అడగకపోయినా చేసేవాడే లీడర్‌. అలాంటి లీడర్‌ మన ఎమ్మెల్యే సార్‌. సింపుల్‌గా చెప్పాలంటే.. వంద గొర్రెలకు ఒక సింహాన్ని లీడర్‌ చేస్తే ఆ వంద గొర్రెలు కూడా సింహాలవుతాయి. మన ఎమ్మెల్యే కూడా మీరు అడగకుండానే అన్నీ చేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా అది కావాలి.. ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు గుత్తి సీఐ రాము అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ పేరుతో డీఎస్పీని ఉద్దేశించి రాసినట్లున్న ఉత్తరం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. గుత్తి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ను ఇటీవల వేరే ప్రాంతానికి బదిలీ చేశారు.

ఇదీ చదవండి: Roads at Anantapur: పవన్​ పర్యటన.. హడావుడిగా రహదారికి మరమ్మతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.