ETV Bharat / state

ఉరవకొండలో చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - ఉరవకొండలో చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వార్తలు

అనంతపురం జిల్లా ఉరవకొండలో చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కంకణధారణ కార్యక్రమంతో ఉత్సవాలను మొదలుపెట్టారు.

Chandramouliswara Swamy Brahmotsavalu begins at Uravakonda
ఉరవకొండలో చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
author img

By

Published : Mar 19, 2021, 9:45 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. గురువారం రాత్రి కంకణధారణ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు పూజారులు. గంగపూజ తదితర కార్యక్రమాలు ప్రధాన అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగాయి.

ఈరోజు స్వామివారు పలు వాహనాల్లో విహరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని చౌకీమఠం పీఠాధిపతి కల్యాణి స్వామి, గవిమఠం ఉత్తరధికారి కరిబసవ రాజేంద్రస్వామి, ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి.
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.