ETV Bharat / state

శిథిలావస్థకు చేరిన సంపద తయారీ కేంద్రాలు..!

author img

By

Published : Nov 30, 2019, 8:43 PM IST

అనంతపురం జిల్లాలో చెత్తనుంచి సంపద తయారీ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సుమారు రూ.34 కోట్లతో ఈ షెడ్లను నిర్మించగా... ఇప్పుడు అవి నిరుపయోగంగా మారాయి. అటు ఖర్చు చేసిన డబ్బులు రాక గుత్తేదారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

wealth-from-garbage-in-anantapur-district
శిథిలావస్థలో తయారీ కేంద్రాలు... కోట్ల రూపాయలు వృధా

శిథిలావస్థకు చేరిన సంపద తయారీ కేంద్రాలు..!

గ్రామాలను పరిశుభ్రంగా మార్చి, అక్కడి చెత్తతో సంపద తయారు చేసే ప్రతిపాదనతో గత ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలను నిర్మించింది. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామ జనాభాను బట్టి వీటి నిర్మాణం చేపట్టారు. గ్రామంలో సేకరించిన చెత్తను వేరుచేసి ఎరువుగా మార్చి స్థానికంగా ఉన్న రైతులకు విక్రయించాలనేది ఈ పథకం ఉద్దేశం. జిల్లావ్యాప్తంగా రూ.33 కోట్ల 19 లక్షల వ్యయంతో 786 షెడ్లను పూర్తిస్థాయిలో నిర్మించారు. 6నెలల క్రితమే ఇవన్నీ అందుబాటులోకి వచ్చినప్పటికీ... సంపద తయారీకి అధికారులు ప్రయత్నించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయని రైతులు వాపోతున్నారు.

బిల్లులు మంజూరు కాలేదు...
అటు షెడ్ల నిర్మాణం పూర్తైనప్పటికీ ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గుత్తేదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రమాణాలు పాటించలేదు...
నిర్మాణంలో కొన్ని లోపాలున్నాయంటున్న అధికారులు... సరైన ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే బిల్లులు ఆగిపోయాయని చెప్పారు.
సేంద్రీయ ఎరువులు అందుబాటులోకి వస్తాయని ఆశించిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రభుత్వం స్పందించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి-ఈ ప్రభుత్వ పాఠశాల... ట్రిపుల్​ ఐటీ ర్యాంకుల అడ్డా..!

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.