రాష్ట్రప్రభుత్వం ఇసుక సరఫరాపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిల్డర్స్, నిర్మాణ రంగ కార్మికులు డిమాండ్ చేశారు. ఇసుక సరఫరాలో కొత్త నిబంధనలు అమలు చేస్తామని చెప్పి.. రాష్ట్ర ప్రభత్వం సరఫరాను నిలిపివేసిందనీ.. దీంతో నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు. గుంటూరులో ఇసుక, గ్రావెల్ సరఫరా లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు నిరసన చేపట్టారు. బాడుగలు లేక నెలనెలా లారీ కిస్తీలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
అనంతపురంలో స్పందన కార్యక్రమంలో కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. వెంటనే ఈ సమస్యపై చర్యలు చేపట్టాలనీ లేనిపక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..