ETV Bharat / state

ఈజీగా డబ్బు సంపాదించాలని.. యూట్యూబ్​లో చూసి.. ఆ తర్వాత

విలాసాలకు అలవాటుపడిన ఓ యువకుడు సులువుగా డబ్బు సంపాదించాలని మాస్టర్ ప్లాన్ రూపొందించాడు. యూట్యూబ్​లో చూసి బ్లాక్​మెయిలర్ అవతారమెత్తాడు. తన తల్లికి వైద్యం చేసిన డాక్టర్​నే బెదిరించి.. డబ్బు లాగాలని పథకం రచించాడు. అయితే.. లాస్ట్ మినిట్​లో సీన్​ రివర్స్ అయ్యింది..

సులభంగా డబ్బు సంపాదించాలని
సులభంగా డబ్బు సంపాదించాలని
author img

By

Published : Jun 12, 2022, 9:14 PM IST

అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం కూచివారిపల్లి గ్రామానికి చెందిన చక్రపాణి మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. చేసిన అప్పులు పెరిగిపోవటంతో తిప్పలు మొదలయ్యాయి. ఒళ్లొంచి పనిచేయటానికి బద్ధకించే చక్రపాణి.. ఈజీగా మనీ సంపాదించాలని డిసైడయ్యాడు. అందుకు ఓ స్నేహితుడి సలహా మేరకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. యూట్యూబ్​లో చూసి బ్లాక్​మెయిలర్​ అవతారమెత్తాడు. గతంలో తన తల్లికి, అత్తకు వైద్యం చేసిన కుమార్​ అనే డాక్టర్​ను బెదిరించి డబ్బు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు తగ్గట్లుగా సినీఫక్కీలో మాస్టర్ ప్లాన్ రూపొందించాడు.

"బెంగళూరు హైవే పక్కన ఉన్న అశోక్ లేలాండ్ షో రూం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రూ. 20 లక్షల పడేసి వెళ్లాలి. నేనడిగిన డబ్బు ఇవ్వకపోతే నీ ప్రాణాలు దక్కవు. నిన్న చంపేస్తా. ఒంటరిగా వచ్చి డబ్బు అక్కడ పెట్టి వెళ్లాలి. ఈ విషయం పోలీసులకు చెబితే కాల్చి పడేస్తా" అంటూ లెటర్లు రాసి తన ద్విచక్రవాహనంలో పెట్టుకున్నాడు. బక్కరాయసముద్రం వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు చక్రపాణి అనుమానాస్పద రీతిలో ఎదురయ్యాడు. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ద్విచక్రవాహనంలో 5 బెదిరింపు లేఖలు బయటపడ్డాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.

డాక్టర్ల వద్ద డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. సులభంగా డబ్బు సంపాదించాడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చక్రపాణి ఒప్పుకున్నాడు. డాక్టర్ కుమార్​తో పాటు నలుగురైదుగురికి బెదిరింపు లేఖలు పంపితే ఎవరో ఒకరు భయపడి డబ్బులు తెచ్చి పడేసి వెళ్తారనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. చక్రపాణితో పాటు అతనికి సలహా ఇచ్చిన స్నేహితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.