అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షాలపైనా... కేంద్రం సాయంపైనా చౌకబారు విమర్శలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు లిమిటెడ్ కంపెనీ లాంటివని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం చేస్తోన్న సాయాన్ని పేర్లు మార్చి... స్టిక్కర్లు అతికించినా భాజపాకు ఏమాత్రం పోటీ కాదన్న విషయాన్ని వైకాపా నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం భాజపాకు లేదని... రాజకీయ పార్టీలే భాజపాలో విలీనమవుతాయని వ్యాఖ్యానించారు.
కరోనా నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం కలిగించేలా నిధులను మంజూరు చేసిన ప్రధానమంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు రాష్ట్ర ప్రజల తరఫున భాజపా కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు.