ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ.. వైకాపా, తెదేపాలతో కలసి ప్రయాణం చేసే ప్రశ్నే లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అనంతపురంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయన్నారు. దీనిపై రైతులకు ఉన్న అపోహలు తొలగించేందుకు జాగరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
రాయలసీమ ప్రాంతంలో పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పంట నష్టంపై అంచనా వేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిపై అన్ని పార్టీలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. కేవలం ఒక్క భాజపా మాత్రమే రాజధాని అమరావతి అని చెబుతోందన్నారు.
ఇవీ చదవండి..