SOMU VEERRAJU : రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. పట్టభద్రుల ఎన్నికలకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించటానికి అనంతపురానికి వచ్చిన సోము వీర్రాజు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు.. అభివృద్ధికి ఖర్చుచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.
గ్రామీణ అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను పంచాయతీల ఖాతాల నుంచి తీసుకోవటం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపండిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమరావతి రాజధానిగా ఉంటుందన్న సోము.. కర్నూలుకు హైకోర్టు రావాల్సిందేనని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదలతో అనంతపురం మునిగిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి విశాఖకు రూ.వంద కోట్లు కూడా ఖర్చుచేయలేదని విమర్శించారు.
ఇవీ చదవండి: