ETV Bharat / state

BJP Leader Somu Veerraju: 'వైఎస్సార్సీపీ పాలన అవినీతి, కుంభకోణాల మయం': బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వాఖ్యలు

author img

By

Published : Jun 16, 2023, 5:02 PM IST

Somu Veerraju Fires on YSRCP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని.. అవినీతికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం రాష్ట్రానికి ఇచ్చిన నిధులలో కూడా కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Somu Veerraju
సోము వీర్రాజు

AP BJP President Somu Veerraju Fires On YSRCP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను దోపిడీ కేంద్రాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు సివిల్​ సప్లయ్​ అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాన్యులు తినని బియ్యాన్ని మిల్లర్లు అందిస్తున్నారని.. ప్రభుత్వం కళ్లు మూసుకున్నట్లుగా వ్యవహరిస్తోందని సోము వీర్రాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో అధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతులను ఆదుకోవటానికి కేంద్రం ఇచ్చిన గైడ్​లైన్స్​ను.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదన్నారు. దళారులతో మిల్లర్ల వ్యవస్థ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని.. సివిల్​ సప్లయ్​ అధికారులు ఇదంతా చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపించారు.

రైతులకు గోనె సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ధాన్యం ట్రాన్స్​పోర్ట్​ ఛార్జీలు ఇవ్వటం లేదని సోము వీర్రాజు అన్నారు. సివిల్​ సప్లయ్​ అధికారులు, మిల్లర్లు కలిసి రైతులను, సామాన్య ప్రజలను దోచుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఓ మిల్లు యాజమానిని.. సివిల్​ సప్లయ్​ కార్పోరేషన్​ ఛైర్మన్​గా నియమించటం దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. దోపిడీకి ఇదే ప్రధాన కారణమన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సమగ్ర శిక్షా అభియాన్​లో తరగతి గదుల నిర్మాణంతోపాటు ఇతర సౌకర్యాల కోసం.. కేంద్రం ఇచ్చిన 30 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

సమగ్ర శిక్షణ అభియాన్ లో తరగతి గదుల నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం 30వేల కోట్లు కేంద్రం నిధులు ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రం విద్యావ్యవస్థను మెరుగుపరచానికి ప్రయత్నిస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇందులో కూడా దోపిడికి పాల్పడుతోందన్నారు. విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాల ప్రింటింగ్​ మొదలుకుని ఏకరూప దుస్తుల వరకు అన్నింటీలోనూ దోపిడీ కొనసాగుతోందని దుయ్యబట్టారు.

ప్రభుత్వం పేదల కోసం ఇళ్లు నిర్మించటానికి కొనుగోలు చేసిన భూములలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కుంభకోణాలకు పాల్పడ్డారని సోము వీర్రాజు తెలిపారు. వనరులు దోపిడీ చేస్తున్నారని.. ఇసుక దోపిడీలో పాత్ర ఈ ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని.. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్​ చేయడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీ, స్పిన్నింగ్​ మిల్లులను ఎందుకు మూసివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వ హయంలో గడిచిన తొమ్మిది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. బీజేపీ బీసీని ప్రధానమంత్రిని చేసిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని ప్రజలకు తెలియజేస్తామని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.