Bear tension in Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇటీవల ఎలుగుబంటుల సంచారం అధికమైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవలే కళ్యాణదుర్గం మండలం దురదగుంట గ్రామ శివారులో ఓ ఎలుగుబంటిని గ్రామస్థులు కొండ ప్రాంతంలోకి తరిమివేశారు. కానీ తాజాగా కంబదూరు మండలం ఎర్రబండలో గురుపాదం అనే మహిళపై ఎలుగుబంటి దాడి చేయడం కలకలం రేపుతోంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన మహిళపై ఎలుగుబంటి దాడి చేయగా.. తీవ్రగాయాలయ్యాయి. ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని బాధిత మహిళా వివరాల మేరకు కేసు నమోదు చేశారు. ఆమెకు పరిహారం అందేలా చూస్తామని కంబదూరు అటవీ అధికారి రామేశ్వరి తెలిపారు.
ఇటీవల రోషన్ వలికొండ - ముదిగల్లు గ్రామాల మధ్య పంట పొలాల్లో వాటి సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పొలాలకు వెళ్లాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: