అనంతపురం జిల్లా హిందూపురంలో తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనాడు-వసుంధర, పాంపర్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ప్రభుత్వాసుపత్రి వైద్యులు కేశవులు హాజరయ్యారు. పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని కేశవులు సూచించారు. చిన్నపిల్లల సంరక్షణ పట్ల అధిక శ్రద్ధ వహించాలనీ.. పోతపాలు పట్టడం వల్ల చిన్నారుల ఎదుగుదల క్షీణిస్తుందని వివరించారు. తల్లిపాలతో పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఈనాడు మేనేజర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..