అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు. ధర్మవరం పట్టణంలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని.. 400 పాజిటివ్ కేసులు రావటం ఆందోళనకరమని ఎమ్మెల్యే అన్నారు. కరోనా నివారణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు.. పది రోజులకు అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఇళ్లలో ఉంచుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ప్రజలు రోడ్లపై తిరగకుండా పోలీసులు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇకపై రోజు మార్చి రోజు ఉదయం 7 నుంచి 9 వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు తెరవాలని సూచించారు. కరోనా పరీక్షలు చేయించుకున్నవారు ఫలితాలు వచ్చేంతవరకు ఇళ్లలోనే ఉండే విధంగా వైద్యులు అవగాహన కల్పించాలని తెలిపారు. కరోనా బారిన పడినవారికి సరైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఇదీ చదవండి: