పాత కక్షలతో అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బాలేపల్లి తండాలో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దాడిలో హరిప్రసాద్ నాయక్ తలకు బలమైన గాయాలయ్యాయి.
బాలేపల్లి తండాకు చెందిన హరిప్రసాద్ నాయక్ కుటుంబంపై అదే ప్రాంతానికి చెందిన మహేష్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. రెండు కుటుంబాలు పరస్పరం వాగ్వాదానికి దిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చికిత్స కోసం బాధితుడిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి 'భాజపాకు మెజార్టీ ఉంది.. ప్రత్యేక హోదా అడగలేకపోతున్నాం'