ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తినా, ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించి ఓటు వేశారని ప్రశంసించారు. ఓపికగా క్యూలైన్లలో నిలబడి... ఓటు వేసి, ఓటు హక్కు విలువను చాటిచెప్పారని ద్వివేది అన్నారు. ఈసీ కార్యాలయం నుంచి వార్డు, గ్రామ, డివిజన్ స్థాయిలోని ప్రతీ అధికారి వారి బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులతో పాటు తనిఖీల్లో పాల్గొన్న పోలీసులు, ఈసీఐఎల్ ఇంజినీర్లు, వాలంటీర్లు, పౌర సంఘాలు ఎంతో సహకరించాయంటూ.. అందరికీ అభినందనలు తెలిపారు. మీడియా ప్రతినిధులు ఎన్నికల నిర్వహణలో విశేషమైన సహకారం అందించారని ద్వివేది ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఓటు విలువ చాటిచెప్పారు.. అందరికీ ధన్యవాదాలు - dwivedi
రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న అందరికీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్లో భాగస్వాములైన సిబ్బందికి, రాజకీయ పార్టీలకు, పోటీ చేసిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.