ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ఏపీపీటిడి ఎంప్లాయిస్ యూనియన్ కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలి శెట్టి దామోదరరావు అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని బలిజ కళ్యాణమండపం లో యూనియన్ జోనల్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని 13 ఆర్ టి సి డిపోల పరిధిలోని నాయకులు ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఆర్టీసీ... ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయిస్ యూనియన్ స్థానంలో ఏపీపీటిడి ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు . అలాగే వారి హక్కుల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమాలకు వెనుకాడబోమని అన్నారు . ఇటీవల కరోనాతో మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగులకు నివాళులర్పించారు.
ఇదీ చదవండీ...'అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తాం'