ETV Bharat / state

'రైతులకు పరిహారం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం' - kalyanadurgam latest news

పంట నష్టం వివరాలను సైతం సేకరించలేని అసమర్థ ప్రభుత్వం ఇదే అని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రైతులకు పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

kalava srinivasulu
kalava srinivasulu
author img

By

Published : Nov 5, 2020, 4:00 PM IST

రాష్ట్ర ప్రభుత్వం మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తెదేపా నేత రామాంజనేయులు అరెస్టును ఖండిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నియోజకవర్గ ఇన్​ఛార్జి ఉమామహేశ్వర నాయుడితో పాటు కాల్వ శ్రీనివాసులు గురువారం ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రైతుల పట్ల వైకాపా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్తే రైతులు నీలదీస్తారని అన్నారు. అనంతపురం జిల్లాలో వర్షాలతో నష్టపోయిన కర్షకులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శ్రీనివాసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

నూతన ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.