అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఆలయానికి వచ్చిన సీజేకు ప్రధాన అర్చకులు, ఈఓ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మూలవిరాట్ను దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తికి అర్చకులు ఆలయ విశిష్టత తెలియజేశారు. సీజే వెంట పలువురు న్యాయమూర్తులు, కదిరి ఆర్డీవో అజయ్ కుమార్ ఉన్నారు. అర్చకులు ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి జ్ఞాపికతో పాటు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇదీ చూడండి : రెండున్నరేళ్లలో విజయవంతంగా 300 గుండె ఆపరేషన్లు