ETV Bharat / state

అంగన్వాడీల ఆవేదన ప్రభుత్వానికి పట్టదా! - అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

Anganwadis Demand To Solve The Problems: రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె వారం రోజులుగా కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే ఈ పోరును మరింత ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంగన్వాడీల దీక్షకు ప్రజా ప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తుందా?

anganwadis_demand_to_solve_the_problems
anganwadis_demand_to_solve_the_problems
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 8:54 AM IST

అంగన్వాడీల ఆవేదన ప్రభుత్వానికి పట్టదా!

Anganwadis Demand To Solve The Problems: తమ డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు వారం రోజులుగా అలుపెరుగని సమ్మెను కొనసాగిస్తున్నారు. సోమవారం పలుచోట్ల భారీ నిరసనలు చేపట్టారు. నా అక్కచెల్లెమ్మలు అని చెప్పుకునే సీఎం జగన్‌ జీతాల పెంపు కోసం రోడ్లెక్కిన తమపై కనికరం చూపడం లేదని అంగన్వాడీలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకుంటే పోరును మరింత ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.

Anganwadis Protest and Demand Solve The Problems: అనంతపురం జిల్లా రాయదుర్గంలో అంగన్వాడీలు ఆకులు, అలములు తింటూ నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పుట్టపర్తిలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద పొర్లు దండాలతో నిరసన తెలిపారు. కదిరిలో కోలాటం ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్డీవో కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. కర్నూలులో అంగన్వాడీల దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. జీతాలు పెంచాలంటూ రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఐదోరోజూ ఆగని అంగన్వాడీల పోరాటం - మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీలు

Anganwadi Strike In All Districts In AP: గూడూరులో అంగన్వాడీలు అమ్మోరుతల్లి వేషధారణతో నిరసన తెలిపారు. గూడూరు, కోడుమూరు మండలాలకు చెందిన అంగన్వాడీ సిబ్బంది ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. నంద్యాల జిల్లా డోన్‌లో అంగన్వాడీ కేంద్రం తాళాలు తెరిచేందుకు వచ్చిన ఐసీడీఎస్, సీపీడీవో మహిళా పోలీస్‌ను సీఐటీయూ, అంగన్వాడీ సిబ్బంది అడ్డుకున్నారు. అధికారులకు, అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెెంటనే పోలీసులు అంగన్వాడీలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ డిపో నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్ రమణమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెకు ప్రథమ చికిత్స అందించారు.

ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి - లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తాం: అంగన్వాడీ కార్యకర్తలు

Anganwadis Strike In Guntur District: గుంటూరు జిల్లా మంగళగిరిలో కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు బైఠాయించి నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా గురజాలలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను అధికారులు రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసనలతో కదంతొక్కారు. ఆర్అండ్‌బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేటు ముందే బైఠాయించారు. ఐసీడీఎస్ పీడీకి వినతిపత్రం అందజేసి ఆందోళన విరమించారు.

అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టిన అధికారులు - సమ్మె అణచివేతకు ప్రభుత్వం యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.