ETV Bharat / state

వెలుగులోకి పూరాతన శిల్పకళ.. 8వ శతాబ్దం నాటిదని అంచనా! - anantapur updates

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బూదిలి గ్రామ చేరువలో పూరాతన శిల్పకళ బయటపడింది. ఇది ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్దానికి చెందినదై ఉంటుందని చారిత్రక పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Ancient sculptures
పూరాతన శిల్పకళ
author img

By

Published : Apr 19, 2021, 10:47 AM IST

బూదిలి సమీపంలో చిత్రావతి నదిలో ప్రాచీన గుడి, గుండ్లపై రాతిచిత్రాలు, శిల్పకళ గుర్తించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం శిలాశాసనాల అన్వేషణ చేశామని.. ఈ క్రమంలో వీటిని గుర్తించామని ఆయన వివరించారు. ఇక్కడ పెద్దపెద్ద రాళ్లపై అనంతశయన భంగిమలోని విష్ణుమూర్తి ప్రతిమ వెలుగు చూసిందని తెలిపారు.

ఇది.. వెయ్యేళ్ల నాటి ఆలయమై ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నదిలో చాలావరకు ఆలయం ఇసుకలో కూరుకుపోయిందని ఇది ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్దానికి చెందినదై ఉంటుందని అంచనా వేశారు. హేమావతి రాజధానిగా పాలన సాగించిన నోలంబుల కాలంలో బూదిలి ముఖ్య కేంద్రంగా విరాజిల్లిందని, అందుకే ఈ పరిసరాల్లో ఎక్కువగా ఆలయాలు ఉన్నాయని మైనాస్వామి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా తగ్గింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.