ఒకే రోజు రెండు ఆలయాల్లో చోరీలు జరిగాయి. ఒక గుడిలో హుండీ ఎత్తుకెళ్లగా, మరో దేవాలయంలో వస్తువుల్ని దోచుకెళ్లారు. ఈ సంఘటనలు అనంతపురం జిల్లా నంబులవూలకుంట మండలం పెడబల్లి గ్రామంలో జరిగాయి.
పెడబల్లి అభయాంజనేయ స్వామి ఆలయ తలుపుల్ని పగులగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. ఇదే గ్రామంలోని చింతల గంగమ్మ తల్లి గుడి తాళాలు పగుల గొట్టి వస్తువులను తీసుకొని పారిపోయారు. రెండు గుళ్లకు తలుపులు తెరిచి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు లోనికి వెళ్లి చూశారు. దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంబులపూలకుంట ఎస్సై వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని రెండు ఆలయాలను పరిశీలించి సమాచారాన్ని సేకరించారు.
ఇదీ చదవండి: