అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకపక్క పడకల కొరత వేధిస్తుంటే.. మరోవైపు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోతున్నాయని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. తోపుదుర్తి ప్రాంతానికి చెందిన నాగభూషణం కరోనాతో సోమవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.
మంగళవారం సాయంత్రం ఆయన మృతి చెందారు. సకాలంలో పడక లభించలేదని, ఆక్సిజన్ శాతం తగ్గుతున్నా వైద్య సిబ్బంది పట్టించుకోలేదని నాగభూషణ కుమారుడు వాపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదరించేది మాని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిబ్బంది నిర్లక్ష్యం వీడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని బాధిత బంధువులు కోరారు.
ఇదీ చదవండి: