మైనర్ బాలలను పనులకు పంపకూడదని అనంతపురం జిల్లా పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. పెనుకొండలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు, అంగన్వాడీలు, ఐసీడీఎస్, కార్మిక శాఖ అధికారులు కలసి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న 10మంది బాలకార్మికులను గుర్తించారు. అనంతరం బాల కార్మికుల తల్లిదండ్రులకు, సంరక్షకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాలలను పనికి పంపకూడదని వారికి అవగాహన కల్పించి బాలలను అప్పగించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: