పురపాలిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. హామీలిస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. అనంతపురం జిల్లాలో తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వేర్వేరు చోట్ల ప్రచారాన్ని నిర్వహించారు.
'డిప్యూటి మేయర్ మైనారిటీలకే...'
అనంతపురం నగరంలో తెదేపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీలకు కేటాయిస్తామన్నారు.
వైకాపా ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర నాయకులు నజీర్ భాష పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ముస్లింలకు సంబంధించిన అన్ని పథకాలను రద్దు చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు, దళితులు తేదేపాకు మద్దతిచ్చి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా బ్యాట్ల పంపిణీ..
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బ్యాట్లు పంపిణీ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇదీ చదవండి: తెదేపా నేత పరిటాల శ్రీరాంపై కేసు నమోదు