ETV Bharat / state

'ఆ బోరు నుంచి నీటిని సరఫరా చేయండి' - anantapur dst water problems

గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ.. అనంతపురం జిల్లా కదిరి మండల పరిషత్ కార్యాలయంలో మొటుకుపల్లి గ్రామస్థులు ఆందోళన చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించటం లేదని ఆగ్రహించారు.

anantapur dst kadiri mandal metupalli villagers protest at mandal parishath office about water problems

author img

By

Published : May 16, 2020, 11:19 AM IST

తాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా కదిరి మండల పరిషత్ కార్యాలయాన్ని మొటుకు పల్లి గ్రామస్తులు ముట్టడించారు. గ్రామంలోని బోరు బావుల్లో నీరు తగ్గిపోయి తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నీటి కష్టాలను తెదేపా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి బోర్ వేయించారన్నారు.

పుష్కలంగా నీరు ఉన్న ఈ బోరు నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి తాగు నీటిని అందించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదు అంటూ భీష్మించుకుని కూర్చున్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎంపీడీవో రమేష్ బాబు, తహసీల్దార్ మారుతి, సిఐలు నిరంజన్ రెడ్డి, రామకృష్ణ హామీ ఇవ్వగా.. గ్రామస్తులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:

'సామూహిక వ్యాప్తిని ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.